Ramgopal Varma దర్శకత్వం వహించిన కొండా సినిమా ప్రమోషన్స్ కోసం కొండా సురేఖ విజయవాడకు వచ్చారు. మొదట వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ఆర్జీవీ, కొండా సురేఖ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందచేశారు. సినిమా ప్రమోషన్స్ కోసమే విజయవాడ వచ్చినట్లు కొండాసురేఖ తెలిపారు.